జూలై 11 నుంచి ఏపి బడ్జెట్‌ సమావేశాలు

AP ASSEMBLY
AP ASSEMBLY

అమరావతి: ఏపి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జూలై 11 నుంచి పదిహేను రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 12వ తేదీన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి టిడిపి ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దీంతో వచ్చేనెల జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఇందుకోసం జూలై 1, 2 తేదీల్లో ఆయన మంత్రులతో సమావేశమై చర్చించనున్నారు. కాగా, వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులకు వడ్డీలేని రుణాలు, పంట భీమా పథకం ప్రీమియం ప్రభుత్వమే చెల్లించడం వంటి అంశాలతోపాటు నవరాత్నాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/