అర్చకులకు తీపి కబురు తెలిపిన జగన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్చకులకు తీపి కబురు అందించారు జగన్ ప్రభుత్వం. ఆర్చుకుల జీతాన్ని ఏకంగా
25 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ..దేవాదాయ శాఖ పై ముఖ్యమంత్రి జగన్‌ ఇవాళ సమగ్రంగా సమీక్షించారని..గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రులు సమీక్షించిన దాఖలా లేదని… వంశపారం పర్యంగా అర్చకుల నియామకం ఉంటుందన్నారు.

రానున్న రోజుల్లో దేవాదాయ శాఖ చేయాల్సిన అభివృద్ధిపై సీఎం దిశానిర్దేశం చేశారని చెప్పారు. అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ జీవో ఇచ్చారని, అదనంగా 25 శాతం జీతం పెంపు నిర్ణయం తీసుకున్నారన్నారు. అర్చకులకు ఇల్లు ఇచ్చే అంశం త్వరితగతిన ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. దేవాదాయ భూములు సర్వే చేసి ఆలయాలకు చెందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.