జగన్ సంచలన నిర్ణయం

జగన్ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్‌ కుమార్‌ ను నియమించారు. గురు గ్రామ్‌ కు చెందిన ఆర్థిక నిపుణుడు రజనీశ్‌కుమార్‌ ను కేబినెట్‌ ర్యాంకు తో నియమిస్తున్నట్లు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రజనీశ్‌ కుమార్‌ ఈ పదవిలో రెండేళ్లు కొనసాగనున్నారు.

గతంలో ఇంగ్లాండ్‌, కెనడాలోని పలు ఆర్థిక సంస్థల్లో రజనీష్‌ కుమార్‌ విధులు నిర్వహించారు. ఫిన్‌టెక్‌ సంస్థల్లో నిపుణుడిగా రజనీష్‌ ఉన్నారు. పలు ఆర్థిక సంస్థల్లో రజనీష్‌ అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయనను ఎంపిక చేసిని జగన్ సర్కార్. ఆర్థిక వనరుల సమీకరణ కు ఇప్పటికే విశ్రాంత ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్ర గార్గ్‌ను సలహాదారుగా నియమించింది ఏపీ ప్రభుత్వం. ఢిల్లీ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు గార్గ్. అలాగే… కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుడి గా ఆర్ పి ఠాకూర్‌ కూడా నియమించింది.