రాష్ట్రానికి 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్

కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రత్యేక అధికారి కృష్ణబాబు

470 metric tons of oxygen to the state-Krishna Babu
470 metric tons of oxygen to the state-Krishna Babu

Vijayawada : రాష్ట్రానికి 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేంద్రం కేటాయించిందని కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రత్యేక అధికారి కృష్ణబాబు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 వేల మందికి ఆక్సిజన్ అందిస్తున్నామని చ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి 70 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందని తెలిపారు. ఆంటీ కాకుండా దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి మరో 170 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తోందని వివరించారు.

ఒరిస్సాలోని టాటా స్టీల్ ప్లాంట్, ఏఎస్‌డబ్ల్యూ నుంచి అంకురు ఆక్సిజన్ ఫిల్లింగ్ స్టేషన్‌లో 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఏపీ కేటాయించారన్నారు. విజయవాడ నుంచి ఒరిస్సా వెళ్లాలంటే 4 రోజులు పడుతుందని, దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్గో విమానం కేటాయించిందని తెలిపారు. వచ్చిన ఆక్సిజన్ సక్రమంగా వినియోగించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో విమానం బయలుదేరి వెళ్తోందని, . గ్రీన్ ఛానెల్ ద్వారా ఆక్సిజన్ వాహనాలు వచ్చేందుకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/