టెన్త్, ఇంటర్ ఫలితాలపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

హైపవర్ కమిటీ ఏర్పాటు-త్వరలో నివేదిక

Students in Examination hall -File
Students in Examination hall -File

Amaravati: ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు నేపథ్యంలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశామని…మూడు, నాలుగు రోజుల్లో కమిటీ నివేదిక ప్రభుత్వానికి వస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కమిటీ సూచనలు మేరకు విద్యార్థులకు మార్కులు ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈనెలాఖరు లోపు విద్యార్థులకు ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు.
ఆగస్టులో సెట్ పరీక్షలు యథాతదంగా జరుగుతాయని… ఆగస్టు రెండో వారం కల్లా విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. . క్లాసులు నిర్వహించని నేపథ్యంలో 70 శాతం ఫీజులు తీసుకోవాలని ఆదేశించామని, రెగ్యులరిటీ అండ్ మానిటరింగ్ కమిటీ ఈ ఏడాది ఫీజులు నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. దీని ప్రకారం ప్రవేటు స్కూల్స్ లో ఫీజులు నిర్ణయిస్తామని పేర్కొన్నారు. . సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడవంతో ఏపీ సర్కార్‌ ఇటీవలే టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/