భారత్ పై దాడి చేసే ఏ ఉగ్రవాదిని వదిలిపెట్టబోం

న్యూఢిల్లీ : నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ,ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చని, నాడు పాకిస్థాన్ లో ఉన్న లాడెన్ ని అమెరికా హతమార్చినట్టే, మసూద్ అజర్ ఇంట్లోకి చొచ్చుకెళ్లి అంతం చేసే శక్తి నేడు భారత్ కు ఉందని చెప్పారు.భారత సైనిక సామర్థ్యంపై ఉన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.నాడు లాడెన్ ను అమెరికా నావికాదళం ఏవిధంగా అయితే మట్టుబెట్టిందో, మసూద్ అజర్ విషయంలో తాము ఆ పని చేయలేమా? అని ప్రశ్నించారు. భారత్ పై దాడి చేసే ఏ ఉగ్రవాదిని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.