ఏ రాజకీయనాయకుడు ఇలా అనలేదు

chandrababu naidu
chandrababu naidu


అమరావతి:  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ప్రజావేదికలో ప్రత్యేక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి వ్యతిరేకులుగా వ్యవహరిస్తున్నారంటూ మోదీ, కేసీఆర్, జగన్ లపై ధ్వజమెత్తారు. ఈ క్రమంలో భారీ స్క్రీన్ పై క్లిప్పింగ్స్ వేసి ఎవరెవరు ఏమన్నారో ప్రదర్శించారు. విపక్ష నేత జగన్ తన గురించి గతంలో చేసిన వ్యాఖ్యల క్లిప్ ప్రదర్శించినప్పుడు చంద్రబాబు ఎంతో ఆవేదనకు గురయ్యారు. తన రాజకీయ జీవితంలో ఏ రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా మాట్లాడలేదని బాధను వ్యక్తం చేశారు.”రాళ్లతో కొట్టాలి, ఓ అమ్మకు అబ్బకు పుట్టాడా? నడిరోడ్డున ఉరితీయాలి? చెప్పుతో కొట్టాలి అంటూ వ్యాఖ్యలు చేశారు… ఏంటిది? చివరికి ఇంట్లో బాబాయి చనిపోతే కూడా గుండెపోటు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ నేను ప్రజలకోసమే భరిస్తున్నా” అని చంద్రబాబు తెలిపారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిhttps://www.vaartha.com/andhra-pradesh/