మేడమ్ టుస్సాడ్ లో మైనపు బొమ్మ

ANUSKHA SHARMA
ANUSKHA SHARMA

అనుష్క శర్మ.. బాలీవుడ్ హీరోయిన్ గా వెలుగు వెలిగి.. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొని హాయిగా జీవిస్తోంది. ప్రస్తుతం  మూడు ఫేమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అనుష్క శర్మ నటిస్తూ బిజిగా ఉంది. ఈ సినిమాలతో అనుష్క మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఖాయమని ప్రచారం   బాలీవుడ్ – హాలీవుడ్ లో కూడా ఫేమస్ అయిన అనుష్కశర్మకు ప్రస్తుతం అరుదైన గుర్తింపు లభించింది. సింగపూర్ లో మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో అనుష్క మైనపు బొమ్మను పెట్టడానికి నిర్ణయించారు. ఈ మేరకు ఆమె కొలతలు కూడా తీసుకున్నారు. అనుష్కతో పాటు అంతర్జాతీయ పేరుపొందిన  ఓప్రా విన్ ఫ్రె – క్రిస్టియానో రోనాల్డో – లూవీస్ హమిల్టన్ మైనపు బొమ్మలను కూడా ఇక్కడ పెట్టబోతున్నారు. ఇలా దిగ్గజాల సరసన అనుష్క చోటు సంపాదించుకోవడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.