మరో రెండు లేడి ఓరియెంటెడ్ స్క్రిప్టులు రెడీ

Anushka
Anushka

తమిళనాడులో నయనతార స్టార్డం ఇప్పుడు పీక్స్ లో ఉంది..  జస్ట్ ఆమె పేరుంటే చాలు సినిమాకు బిజినెస్ అవుతోంది.  ఇప్పుడు తెలుగులో నయనతార కూడా అలాంటి దారిలోనే పయనిస్తున్నట్టుగా ఉంది.   ఇప్పటికే  అనుష్క’అరుంధతి.. ‘పంచాక్షరి’.. ‘రుద్రమదేవి’.. ‘వర్ణ’.. ..`జీరో సైజ్`…. ‘భాగమతి’ ఇలా చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించింది.   అందులో మెజారిటీ సినిమాలు సినిమాలు హిట్లే. మళ్ళీ ఇప్పుడు అనుష్క ఒక యువ దర్శకుడు చెప్పిన లేడీ ఓరియెంటెడ్ స్టొరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.  ఈ  సినిమాలో అనుష్కకు జోడీగా మాధవన్ నటిస్తాడట.  కోన కార్పొరేషన్ – పీపుల్ మీడియా వారు ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్టు మాత్రమే కాకుండా అనుష్క కోసం మరో రెండు లేడి ఓరియెంటెడ్ స్క్రిప్టులు రెడీ అవుతున్నాయట.  చూస్తుంటే స్వీటీ త్వరలో తెలుగు నయనతారగా మారేలా ఉంది.