‘అన్విత రవళి శెట్టి’ గా రాబోతున్న అనుష్క..ఫస్ట్ లుక్ అదిరింది

అనుష్క తెరపై కనిపించి చాల కాలం అవుతుంది. ఆమెను తెరపై చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో అనుష్క తాలూకా తాజా చిత్రం లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు యూవీ క్రియేషన్స్. ‘అరుంధతి’ ‘రుద్రమదేవి’ ‘భాగమతి’ వంటి హ్యాట్రిక్ సినిమాలతో ఆకట్టుకున్న అనుష్క..ఆ తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది. చివరగా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబడిన ‘నిశ్శబ్దం’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఈమె ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈరోజు (నవంబర్ 7) అనుష్క పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఆమె పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో ‘అన్విత రవళి శెట్టి’ అనే పాత్రలో అనుష్క నటిస్తున్నట్లు తెలిపారు. #Anushka48 ఫస్ట్ లుక్ లో అనుష్క ఒక చెఫ్ గా వంట చేస్తూ కనిపిస్తోంది. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉన్న స్వీటీ.. ఇప్పుడు చాలా స్లిమ్ గా మారిపోయింది. అలానే చాలా అందంగానూ ఉంది. ఈ పోస్టర్ లో చెఫ్ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది.