ప్రియాంక రెడ్డి హత్యపై స్పందించిన అనుష్క

సమాజంలో మహిళగా పుట్టడమే నేరమా?

anushka
anushka

హైదరాబాద్‌: సిని నటి అనుష్క డాక్టర్‌ ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సమాజంలో మహిళగా పుట్టడమే నేరమా? అని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే… అవి కూడా సిగ్గుపడతాయని అన్నారు. అమాయకురాలైన ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసిని చంపేశారని… ఇది మానవాళిని మొత్తం కదిలించే విషాదకరమైన ఘటన అని చెప్పారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి వెంటనే శిక్ష పడే విధంగా మనందరం కలిసి పోరాడుదామని అన్నారు. ప్రియాంక రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/