మన్మధుడు తో భాగమతి.

Anushka
Anushka

నాగార్జున ప్రస్తుతం ‘మన్మధుడు 2’ చిత్రం కోసం సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. దేవదాస్ నిరుత్సాహ పర్చిన నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకున్న నాగార్జున ‘చిలసౌ’ చిత్రంతో మెప్పించిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మధుడు 2′ చిత్రాన్ని చేసేందుకు గ్రీన్ స్నిగల్ ఇచ్చాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. కథానుసారంగా ఈ చిత్రం యూరప్ లో ఎక్కువగా చిత్రీకరణ జరుపబోతున్నారట. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మన్మధుడు’ చిత్రంలో అప్పట్లో సోనాలి బింద్రే మరియు అన్షులు నటించారు. వారిద్దరు కూడా అందంతో ఆకట్టుకుని మన్మధుడికి సరైన జోడీ అనిపించుకున్నారు. అందుకే మన్మధుడు టైటిల్ కు తగ్గట్లుగా హీరోయిన్స్ కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు రాహుల్ రవీంద్ర మరియు నాగార్జునలు చాలా పేర్లు పరిశీలించి చివరకు ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పూత్ మరియు బాహుబలి ముద్దుగుమ్మ అనుష్కను ఎంపిక చేశారట.