ఓనం స్పెషల్

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ‘ప్రేమమ్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అ ఆ’.. ‘శతమానం భవతి’ హిట్లతో హ్యాట్రిక్ సాధించింది.
ఈరోజు ఓనం పండుగ. కేరళ ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకునే ఫెస్టివల్. ట్రెడిషనల్ హాఫ్ వైట్ కలర్ చీరలు ధరించి అమ్మాయిలు చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. అనుపమా కూడా మలయాళి అమ్మాయే కదా. అందుకే అందరికీ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఓనం శుభాకాంక్షలు తెలిపింది. కేరళ ట్రేడ్ మార్క్ కలర్ చీర ధరించి సూపర్ గా రెడీ అయింది. ఆ ఫోటోలను షేర్ చేసింది. క్రీమ్ కలర్ చీర.. బ్లూ కలర్ బ్లౌజ్ లో పాలకోవాలాగా కనిపిస్తోంది. రింగుల జుత్తు కూడా భలే ఉంది. ముక్కు పుడక.. వేలాడే ఇయర్ రింగ్స్ ధరించి పర్ఫెక్ట్ లోకల్ బ్యూటీ లాగా పోజులిచ్చింది. ఆ స్మైల్ కూడా సూపరే.
ఈ ఫోటోకు స్పందనగా నెటిజన్లు చాలామంది అనుపమకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇక కొందరు ఇతర నెటిజన్లు భలే భలే కామెంట్లు పెట్టారు.
అనుపమ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ నటించే మలయాళం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.