”అనుభవించు రాజా” ట్రైలర్ మాములుగా లేదుగా

''అనుభవించు రాజా'' ట్రైలర్ మాములుగా లేదుగా

గత కొద్దీ రోజులుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం ”అనుభవించు రాజా” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీను గవిరెడ్డి డైరెక్షన్లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా టీజర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసారు. టీజర్ రిలీజ్ చేస్తూ.. వీడియో చాలా ఫన్నీగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్‌ మొత్తానికి బెస్ట్ విషెష్ చెబుతూ ‘అనుభవించు రాజా’ టీజర్‌ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఒక నిమిషం రెండు సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌‌లో జల్సా రాయుడుగా రాజ్ తరుణ్ కనిపించాడు.

భీమవరంలో కోడి పందెం సెటప్ ను చూపిస్తూ పందెం రాయుళ్లందరికీ స్వాగతం పలకడంతో ఈ టీజర్ ప్రారంభమైంది. ‘అనుభవించు రాజా..’ అంటూ సూపర్ హిట్ ఓల్డ్ సాంగ్ ప్లే అవుతుండగా.. రాజ్ తరుణ్ ను విలాసాలకు అలవాటు పడిన జూదగాడిగా పరిచయం చేయబడ్డాడు. అతను రికార్డింగ్ డ్యాన్స్ ల్లో డ్యాన్స్ చేయడం.. బెట్టింగ్ జూదం పేకాట ఆడటం కనిపిస్తుంది.

“అయినా బంగారం గాడు ఊర్లోని ఆడి పుంజు బరిలోని ఉండగా.. ఇంకొకడు గెలవడం కష్టం…” అని మీసాలు తిప్పుతూ రాజ్ తరుణ్ ప్రగల్భాలు పలుకుతూ కనిపించాడు. ‘యాక్టన్ చేయాలి.. ఓవర్ యాక్టింగ్ చేయకూడదు’ అని సహచరుడు బంగారం గాడికి కౌంటర్ వేయడం నవ్వు తెప్పిస్తోంది. ఇక టీజర్ చివర్లో ‘నువ్వు గెలిచి నా పరువు కాపాడితే.. సాయంత్రం నీ గంప కింద నాలుగు పెట్టలు పెడతా’ అంటూ పందెం పుంజుతో మాట్లాడటం అలరిస్తోంది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన కాశిష్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. పోసాని కృష్ణమురళి – ఆడుకాలమ్ నరేన్ – అజయ్ – సుదర్శన్ – టెంపర్ వంశీ – ఆదర్శ్ బాలకృష్ణ – రవి కృష్ణ – భూపాల్ రాజు – అరియానా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.