‘అంటే..సుందరానికి’ అదిరిపోతుంది.. ప్రామిస్: నాని

ఘనంగా టీజర్ లాంచ్ ఈవెంట్

'Ante..Sundaraniki' teaser release event
‘Ante..Sundaraniki’ teaser release event

”టీజర్ అదిరిపోయింది కదా.. దీనికి రెండు రెట్లు ట్రైలర్ వుంటుంది. ట్రైలర్ కి పదిరెట్లు సినిమా వుంటుంది. ప్రామిస్” అన్నారు నేచురల్ స్టార్ నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్  ‘అంటే సుందరానికి’ చిత్రం జూన్ 10న విడుదలకు సిద్ధమైయింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ జోరుగా ప్రొమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. బుధవారం టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

హీరో నాని మాట్లాడుతూ.. ‘అంటే సుందరానికి నాకు చాలా స్పెషల్ సినిమా. ఎందుకనేది .. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకే అర్ధమైపోతుంది. ఈ సినిమా కోసం చాలా మంచి టీమ్ పని చేసింది. చాలా రోజుల తర్వాత అంతా ఫ్యామిలీ మెంబర్స్ తో కలసి పని చేస్తున్నామనే ప్లజంట్ ఫీలింగ్ కలిగింది. ఇది మీకు తెరపై కనిపిస్తుంది. సినిమా గురించి చెప్పాల్సిన విషయాలు చాలా వున్నాయి.  టీజర్ లాంచ్ కాబట్టి అప్పుడే సినిమా గురించి ఎక్కువ చెప్పను. కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ గురించి మాత్రం ఒక మాట చెప్పాలి. కొన్ని సినిమాలు, కథలు మరో దర్శకుడు తీస్తే ఎలా వుంటుంది ? అని ఊహించుకునే అవకాశం వుంటుంది. కానీ వివేక్ తీసిన సినిమా మాత్రం వివేక్ తప్పా ఎవరూ తీయలేరు. ఈ కథని వివేక్ చెప్పినట్లు ఎవరూ చెప్పలేరు. నాలో వుండే ప్రేక్షకుడు వివేక్ చేసే సినిమాలు రిలీజ్ అయితే ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలని ఫిక్స్ అయిపోయాడు. నజ్రియా తెలుగులో నటిస్తే బావుటుందని చాలా కాలంగా చాలా మంది ప్రయత్నించారు. కానీ ఎవరి ఫోన్లు ఎత్తలేదు. మా రిక్వెస్ట్ ఒప్పుకున్నందుకు, మా సినిమాలో నటించినందుకు నజ్రియాకి చాలా థ్యాంక్స్. టీజర్ అదిరిపోయింది. దీనికి రెండు రెట్లు ట్రైలర్ వుంటుంది. ట్రైలర్ కి పదిరెట్లు సినిమా వుంటుంది. ప్రామిస్” అని నాని అన్నారు..

దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. ” మైత్రీ మూవీ మేకర్స్, నాని గారు, నజ్రియా ఇది డ్రీం కాంబినేషన్. నాని, నజ్రియా నటన గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. మీరంతా చూస్తారు. నా టీమ్ అందరికీ థ్యాంక్స్. స్క్రిప్ట్ రాసినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాను” అని పేర్కొన్నారు

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ… ఈ సినిమా మాకు చాలా చాలా స్పెషల్. స్క్రిప్ట్ చదివినప్పుడే హిట్ అనుకునే సినిమాలు కొన్ని వుంటాయి. అందులో అంటే సుందరానికి కూడా వుంది. ఈ స్క్రిప్ట్ వినగానే సూపర్ డూపర్ హిట్ అనుకున్నాం. ఈ సినిమాకి పనిచేసిన టెక్నిషియన్లు అంతగొప్ప సింక్ తో పాజిటివ్ ఎనర్జీతో వర్క్ చేశారు. షూట్ చేస్తున్నపుడే సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వచ్చిందని పేర్కొన్నారు. హీరోయిన్ నజ్రియా , సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి , ఎడిటర్ రవితేజ ,ప్రొడక్షన్ డిజైనర్ లత మాట్లాడారు.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/