ఐపిఎల్‌లో మరో విండీస్‌ ప్లేయర్‌ జోసెఫ్‌…

Alzarri Joseph
Alzarri Joseph

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌)లో అలరించడానికి మరో వెస్టిండీస్‌ ఆటగాడు సిద్ధమయ్యాడు. ఇప్పటికే క్రిస్‌ గేల్‌, ఆండ్రీ రసెల్‌, డ్వేన్‌ బ్రేవో, పొలార్డ్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు తమ ప్రత్యేకతను చాటుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సీజన్‌లో విండీస్‌కే చెందిన పేసర్‌ అల్జర్రీ జోసెఫ్‌ ఆడబోతున్నాడు. అతను ముంబై ఇండియన్స్‌ తరుపున బరిలోకి దిగబోతున్నట్లు ఐపిఎల్‌ యాజమాన్యం స్పష్టం చేసింది. ముంబై ఇండియన్స్‌ తరుపున ఆడుతూ గాయం కారణంగా జట్టుకు దూరమైన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ ఆడమ్‌ మిల్నే స్థానంలో అల్జర్రీ జోసెఫ్‌ను తీసుకున్నారు. ఈ మేరకు జోసెఫ్‌తో ముంబై ఇండియన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఆడమ్‌ మిల్నే మడమ గాయంతో స్వదేశానికి పయనమైన నేపథ్యంలో అతని ప్రత్యామ్నాయంగా జోసెఫ్‌ ఆడటానికి అనుమతి ఇచ్చారు. ఈసీజన్‌లో మిల్నే స్థానాన్ని జోసెఫ్‌ భర్తీ చేస్తాడని ఐపిఎల్‌ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. వెస్టిండీస్‌ తరుపున 9 టెస్టుఉల, 16 వన్డేలు ఆడిన అనుభవం జోసెఫ్‌ది. కుదిచేతి వాటం పేసర్‌ అయిన జోసెఫ్‌ 25 టెస్టు వికెట్లు, 24 వన్డే వికెట్లను సాధించాడు. ఇప్పటికే శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ ముంబై ఇండియన్స్‌తో కలవగా, ఇప్పుడు జోసెఫ్‌ ఎంపికతో ఆజట్టు బౌలింగ్‌ విభాగం మరింత పటిష్టమైంది. ముంబై ఇండియన్స్‌ తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో పరాజయం చవిచూసింది.

మరిన్ని తాజా క్రిడా వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/sports/