మరో దారుణం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై అత్యాచారం?

rape victim
rape victim

హైదరాబాద్‌: వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను ఉరితీయాలంటూ దేశం మొత్తం ముక్త స్వరంతో వినిపిస్తుంది. అయినా ఈ మృగాలకు ఏ కోశాన భయం కలగడంలేదు. ఓ దుర్మార్గుడు ఒంటరిగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె తన అక్కతో కలిసి నిజాంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. తను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కాగా, తన అక్క ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. పదిరోజుల క్రితం తన పెళ్లి చూపుల నేపథ్యంలో అతడు వచ్చాడు. ఆ తర్వాత తరచూ అపార్ట్‌మెంట్‌కు వచ్చేవాడు. కాగా బయటికి వెళ్లిన అక్క తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం వేసి ఉండడంతో తనకు ఫోన్‌ చేసింది. ఫోన్‌ కలవలేదు, ఎంతకీ తిరిగి రాకపోవడంతో తాళం పగులగొట్టింది. లోపలికి వెళ్లిన ఆ అక్కకు తన చెల్లి అపస్మారకస్థితిలో ఉండడం చూసి ఖంగుతిన్నది. ఇల్లంతా చిందరవందరగా ఉండడంతో అనుమానించి ఇంట్లోని బంగారం, చెల్లి సెల్‌ఫోన్‌ చూసింది అవి లేక పోయేసరికి ఇదంతా ఆ దుర్మార్గుడి పనేనని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితురాలిపై అత్యాచారం జరిగిందా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. కానీ జరిగే అవకాశం లేకపోలేదని అనుమానిస్తున్నారు. కాగా తన అక్కను చూసుకోవడానికి వచ్చిన వ్యక్తే ఇందంతా చేసి ఉండొచ్చునని, తన అక్కను రూ. 2 లక్షలు కావాలని అడగ్గా తను లేవనడంతో ఇలా చేసి ఉండొచ్చునని పోలీసులు అనుకుంటున్నారు. కాగా చోరీ అనంతరం ఇంటికి తాళం వేసి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/