ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి

వందే భారత్ రైళ్ల ఫై రాళ్ల దాడులు ఆగడం లేదు. ఎక్కడో ఓ చోట దాడి అనేది వార్తల్లో నిలుస్తుంది. ఇప్పటికే పలు చోట్ల రైళ్ల ఫై దాడి జరుగగా..తాజాగా ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ రైలు ఫై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో సీ 12 కోచ్ విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసమైంది.

దీంతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఉన్నతాధికారులు సీసీటీవీ ఫుటేజీలో నిందితులను గుర్తించారు. రైల్వే అధికారులు ధ్వంసమైన గ్లాస్ ను విశాఖ స్టేషన్ లో మార్చారు. దీంతో రైలు ఆలస్యంగా బయలుదేరింది. మూడు గంటల లేటు గా విశాఖ – సికింద్రాబాద్ ట్రైన్ పయనం కానుంది. అయితే గతంలో కూడా వందే భారత్ ట్రైన్ పై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే.

ఇక సంక్రాంతి నాడు ఈ నెల15న ప్రధాని మోడీ వందేభారత్ ను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ విశాఖపట్నంలో ఉదయం 5.45కు బయలుదేరి మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్‌ స్టేషన్‌ చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి మళ్లీ రాత్రి 11.30కు విశాఖపట్నం చేరుతుంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ స్టేషన్లలో మాత్రమే నిలుస్తుంది.