రూ.54000 దాటిన పసిడి ధర

హైదరాబాద్‌లో 10 గ్రాములు రూ.54,300

gold-silver-prices-rise-new-highs
gold-silver-prices-rise-new-highs

హైదరాబాద్‌: దేశంలో పసిడి ధరలు పరుగులు పెడుతుంది. అన్ని నగరాల బులియన్‌ మార్కెట్లలో గోల్డ్‌ ఆల్‌టైం రికార్డును నమోదు చేసుకుంది. హైదరాబాద్‌ మార్కెట్లో తులం (10 గ్రాములు) మేలిమి (24 క్యారెట్లు) బంగారం సోమవారం ఏకంగా రూ.820 పెరిగి రూ.54,300కు చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.730 ఎగబాకి రూ.49,780గా నమోదైంది. ఈ క్రమంలోనే వెండి కూడా ఏకంగా రూ.3,490 పెరిగి రూ.64,700 స్థాయికి చేరుకుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/