మెర్సిడెస్‌ నుండి మార్కెట్లోకి ఎల్‌బ్ల్యూబీ జీఎల్‌ఈ

another-motown-beauty-mercedes-
another-motown-beauty-mercedes

ముంబయి: దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్‌-బెంజ్‌ ఇండియా తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలోని లాంగ్‌ వీల్‌ బేస్‌(ఎల్‌డబ్లూబీ) జీఎల్‌ఈలో రెండు నూతన వేరియంట్లను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటిలో ఎల్‌డబ్లూబీ జీఎల్‌ఈ400 డీ ధర రూ.1.25 కోట్లు. ఎంట్రీ లెవెల్‌ మోడల్‌లో 2.0 లీటర్ల 4-సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను..హిప్‌-హాప్‌లో 3.0 లీటర్ల 6-సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ అమర్చింది. జీఎల్‌ఈ మోడల్‌ 7.2 సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదని, గరిష్టంగా గంటకు 225 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని సంస్థ వెల్లడించింది. లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో జీఎల్‌ఈమోడల్‌ అత్యధిక అమ్మకాలను నమోదు చేసిందని సంస్థ సీఈవో మార్టిన్‌ ష్వెంక్‌ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/