హైదరాబాద్ లో మరో చిన్నారి ఫై అత్యాచారయత్నం..

సింగరేణి ఘటన ఇంకా సంచలనం రేపుతుండగానే మహా నగరంలో మరో చిన్నారి ఫై అత్యాచారయత్నం జరగడం తల్లిదండ్రులను షాక్ కు గురి చేస్తుంది. మంగ‌ల్ ఘట్ లోని హబీబ్ న‌గ‌ర్ లో సుమిత్ అనే మృగాడు తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఆ చిన్నారి గట్టిగా కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగు వాళ్లు వ‌చ్చారు. దాంతో వారిని చూసి సుమిత్ అక్క‌డ నుండి పారిపోయే ప్రయత్నం చేసాడు. కానీ స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పజెప్పారు.

నింధితుడిని కూడా క‌ఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆ చిన్నారి కేకలు వేయకపోతే దారుణం జరిగి ఉండేదని అంత అంటున్నారు. సైదాబాద్ ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపేసిన నిందితుడు రాజు ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈరోజు ఉదయం స్టేషన్ ఘనపూర్ రైల్వే ట్రాక్ ఫై ఆత్మ హత్య చేసుకున్నాడు. రాజు ఆత్మ హత్య చేసుకోవడం తో సింగరేణి కాలనీ లో స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ MGM హాస్పటల్ కు తరలించారు.