భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై మరో సమావేశం

Narendra Modi and Xi Jinping
Narendra Modi and Xi Jinping

బ్రెజిల్‌: బ్రిక్స్‌ సమ్మిట్‌ సందర్భంగా ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమైన అనంతరం సరిహద్దు వివాదానికి సంబంధించి మరో సమావేశం నిర్వహించడానికి భారత్‌-చైనాలు అంగీకరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌, చైనా జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ మంత్రి వాంగ్‌ యి నేతృత్వంలో భారత్‌ -చైనా సరిహద్దు చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా సరిహద్దుకు వివాదానికి సంబంధించి మరో సమావేశం నిర్వహించనున్నారని, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతల ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారని విదేశాంగ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశానికి సంబంధించి షెడ్యూల్‌ను పేర్కొనలేదు. బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోడీ, జిన్‌పింగ్‌లు బ్రెజిల్‌లో సమావేశమయ్యారు. సరిహద్దు వివాదంపై ముందస్తు పరిష్కారం కోసం చర్చలను తీవ్రతరం చేసేందుకు ఇరుపక్షాలు సంకల్పించాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతి, భద్రతలను కాపాడుకునేం దుకు ఇరు దేశాలకు చెందిన భద్రతా దళాల మధ్య సంబంధాలను మెరుగుపర్చడానికి కృషి చేయాలని ఇరు నేతలు ఉద్ఘాటించారు. తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/