భారత ప్రభుత్వం మరో భారీ డీల్

p-81 aircraft
p-81 aircraft

ఢిల్లీ: భారత ప్రభుత్వం త్రివిధ దళాలకు సంబంధించి మరో భారీ ఒప్పందానికి సిద్ధమవుతుంది. మానవరహిత విమానాల(డ్రోను) కోసం త్రివిధ దళాలు సంయుక్తంగా తమకున్న అవసరాల దృష్ట్యా ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిసింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌కు డ్రోన్‌లను విక్రయించంచ్చునని ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఈ దిశగా అడుగులు పడడం ప్రారంభమయ్యాయి. రెండు ప్రభుత్వాల మధ్య నేరుగా జరగనున్న ఈ గార్డియన్‌ డ్రోన్ల ఖరీదు సుమారు 32 వేల కోట్లకు పై చిలుకు ఉంటుందని సమాచారం. కాగా మరోవైపు నావికాదళం కోసం ప్రత్యేకంగా స్పై ప్లేన్స్‌ను కొనుగోలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పీ-81 విమానాలకు అదనంగా మరో పది విమానాలను కొనుగోలు చేసేందుకు నావికాదళం ప్రతిపాదనను సిద్ధం చేస్తుంది. ఈ పది విమానాల విలువ దాదాపుగా 21 వేల కోట్ల రూపాయలకు పైగా ఉండొచ్చునని సమాచారం.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/