రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

farmer died of heart attack
farmer died of heart attack

అమరావతి: ఏపి రాజధాని అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. అమరావతి పరిధిలోని వెలగపూడికి చెందిన అబ్బూరి అప్పారావు(55) అనే రైతు గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి చెందాడు. రాజధాని నిర్మాణానికి అప్పారావు తన 7 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చాడు. ఇప్పుడు రాజధాని విశాఖకు తరలిపోతుండటంతో గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్నాడు. దీంతో పాటు రాజధాని ఉద్యమంలో పాల్గొన్న తన కుమారుడు, కోడలిపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తుండటంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆ మానసిక ఆవేదనతోనే అప్పరావు మరణించినట్లు బంధువులు చెబుతున్నారు. మరోవైపు అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానికి తరలిస్తే ఊరుకునేది లేదంటూ గత 33 రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. మరోవైపు చంద్రబాబు కూడా రాజధాని గ్రామాల్లో పర్యటించి ఆందోళనకారులకు మద్దతు ఇస్తున్నారు. దీంతో అమరావతి గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/