దిల్ రాజు కు మరో కష్టం

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కు ఈ మధ్య వరుస షాక్ లు తగులుతున్నాయి. రీసెంట్ గా ఈయన తమిళ్ హీరో విజయ్ తో వారసుడు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా , తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగు, తమిళ్ లో ఏక కాలంలో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.

దీనితో చిరంజీవి వాల్తేరు వీరయ్య, మరియు బాలయ్య బాబుల వీర సింహ రెడ్డి లు కూడా సంక్రాంతికి వస్తున్నాయి. దిల్ రాజు తమిళ్ నాడు పోతే ఇది తమిళ సినిమా అని తెలుగుకు వస్తే ఇది తెలుగు సినిమా అని పాట పడుతున్నాడు. దీనితో వారసుడు కు థియేటర్స్ ఇవ్వొదని తెలుగు నిర్మాతలు నోటీస్ పంపారు. దీనిపై చర్చ నడుస్తుండగా..తాజాగా దిల్ రాజు కు మరో కష్టం వచ్చిపడింది.

ఈ సినిమాలో అనుమతి లేకుండా జంతువులను వాడినందుకు జంతు పరిరక్షణ సమితి కేసు వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ఒక సీన్ లో ఎలిఫెంట్ ను ఉపయోగించారట. జంతు పరిరక్షణ సమితి వారు పర్మిషన్ లేకుండా షూటింగ్ చేశారని, వణ్యప్రాణి సంరక్షణ చట్టం 1972 రూల్ 7(2) షెడ్యూల్ 1 ప్రకారం నోటీసులు పంపారట. మరి ఈ సమస్యల నుండి దిల్ రాజు ఎలా బయటపడతారో చూడాలి.