తెలంగాణలో మరో కరోనా కేసు

రాష్ట్రంలో 78కి చేరిన పాజిటివ్‌ కేసులు

corona virus
corona virus

నాగర్‌కర్నూల్‌: తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని డిఎంహెచ్‌వో సుధాకర్‌ లాల్‌ వెల్లడించారు. దిల్లీ నిజాముద్దీన్‌లో మత ప్రార్ధనలకు జిల్లానుంచి 11 మంది వెళ్లినట్లు అధికారులు గురించారు. వారి నమూనాలను పరీక్షలకు పంపగా 10 మంది రిపోర్టులు వచ్చాయి. ఇందులో 9 మందికి నెగిటివ్‌ రాగా.. ఒకరికి పాజిటివ్‌ అని తేలింది. మరొకరి నివేదిక రావాల్సి ఉందని డిఎంహెఛ్‌వో సుధాకర్‌లాల్‌ తెలిపారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 78కి చేరింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/