రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదు

ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద నకిలీ ఐడీ

Ravi Prakash
Ravi Prakash

హైదరాబాద్‌: టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదయింది. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఆయన నకిలీ ఐడీ సృష్టించడంతో సీసీఎస్ పోలీసులు 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. టీవీ 9లో రూ.18 కోట్ల నిధుల అవకతవకల కేసులో ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయనను పీటీ వారెంట్ ద్వారా పోలీసులు మియాపూర్ న్యాయస్థానానికి తీసుకొస్తున్నారు. కాగా, నిన్న కూడా రవి ప్రకాశ్ పై ఓ కేసు నమోదయింది. ఆయనకు చెందిన వెబ్‌ ఛానెల్స్‌లో తనపై ఆసత్య ప్రచారాలు చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేయడంతో… రవిప్రకాశ్ మీడియా హౌస్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్‌పై తాను ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినప్పటికీ, ఫిర్యాదు చేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని రామారావు ఆరోపించారు.


తాజా ఏపి వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/