చింతమనేనికి మరో కేసులో రిమాండ్


ఇప్పటికే ఏలూరు జైల్లో రిమాండ్ లో ఉన్న చింతమనేని

Chintamaneni Prabhakar
Chintamaneni Prabhakar

ఏలూరు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇప్పటికే ఏలూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్నారు. మరో కేసుకు సంబంధించి నేడు పీటీ వారెంట్ పై చింతమనేనిని ఏలూరు జిల్లా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో కోర్టులో ప్రవేశపెట్టారు. 2018లో తన వద్దకు వచ్చిన ఓ దివ్యాంగుడిపై చింతమనేని చేయి చేసుకున్నారనే వార్త అప్పట్లో సంచలనంగా మారింది. ఈ కేసును విచారించిన కోర్టు వచ్చే నెల 10 వరకు ఆయనకు రిమాండ్ విధించింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/