హైదరాబాద్ లో మరో కేబుల్ బ్రిడ్జి..?

హైదరాబాద్ నగరవాసుల కు గుడ్ న్యూస్ ..నగరంలో మరో కేబుల్ బ్రిడ్జి ఏర్పటు కాబోతుంది. ప్రస్తుతం దుర్గం చెరువు ఫై కేబుల్ బ్రిడ్జి అందుబాటులో ఉండగా..ఇప్పుడు మీరాలం చెరువు ఈస్ట్ సైడ్ చింతల్ మెట్ నుంచి బెంగళూరు-హైదరాబాద్ నేషనల్ హైవే-44 కు అనుసంధానం చేసేలా.. ఓ భారీ తీగల వంతెన నిర్మాణానికి అనుమతులు మంజూరు అయ్యాయి.

కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్లాన్ చేస్తుంది. చింతల్ మెట్ నుంచి బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి వరకు మొత్తం నాలుగు లైన్ల రోడ్డు 2.65 కిలోమీటర్ల పొడవు వేయనున్నారు. దీనికి రెండు చోట్ల ఎంట్రీ ర్యాంపులతో పాటు ఒక చోట ఎగ్జిట్ ర్యాంప్ ఉండేలా అధికారుల ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళిక సిద్ధం అయి మరో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరిగితే హైదరాబాద్ మణిహారంలో మరో సుందర ప్రదేశం చేరుతుంది.