భీమ్లా నాయక్ నుండి ఈరోజు మరో అప్డేట్ రాబోతుంది

భీమ్లా నాయక్ నుండి ఈరోజు మరో అప్డేట్ రాబోతుంది

వకీల్ సాబ్ మూవీ తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవర్ స్టార్..సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ అంటూ కలెక్షన్ల మోత మోగించేందుకు వస్తున్నాడు. సాగర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ తో పాటు రానా నటిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేసి అంచనాలు పెంచగా..ఈరోజు సాయంత్రం మరో అప్డేట్ ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారకంగా తెలిపారు.

“ఇప్పటి వరకు పవర్ తుఫాను చూశారు. ఇప్పుడు గెట్ రెడీ ఫర్…. ఇవాళ సాయంత్రం 04;05 గంటలకు సిద్ధంగా ఉండండి” అంటూ భీమ్లా నాయక్.. సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ స్పష్టం చేసింది. కాగా ఇంతవరకూ హీరో రానా కు సంబంధించి ఒక అప్డేట్ కూడా రాలేదు. దీన్నిబట్టి ఈ రోజు రానా గురించి అప్డేట్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. మరి రానా అప్డేట్ ఏమైనా వస్తుందా..లేక ఈరోజు పవన్ కళ్యాణ్ కు సంబంధించింది వస్తుందా అనేది చూడాలి.

You’ve experienced the Power Storm.

Now get ready for .….

Hang on until 04:05pm, Today! 🤜#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @dop007 @NavinNooli @vamsi84 @sitharaents @adityamusic— Sithara Entertainments (@SitharaEnts) September 17, 2021