ఏపిలో మరో 79 కరోనా కేసులు నమోదు

మొత్తం కరోనా కేసులు 3,279

corona virus – ap

అమరావతి: ఏపి కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 8,066 శాంపిళ్లను పరీక్షించగా180 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపికి చెందిన 79 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలగా,  ఇతర రాష్ట్రాల నుంచి ఏపికి వచ్చిన 94 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే విదేశాల నుంచి ఏపికి వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏపిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,279కి చేరుకున్నాయి. ఈరోజు 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం 2,244 మంది డిశ్చార్జ్ అయ్యారు. చిత్తూరు ఇద్దరు, కర్నూలులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఈమేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/