ఏపిలో కొత్తగా మరో 2,593 కేసులు

రాష్ట్రంలో 492కి చేరిన కరోనా మృతుల సంఖ్య

ఏపిలో కొత్తగా మరో 2,593 కేసులు
coronavirus -ap

అమరావతి: ఏపిలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది. గురవారం నాడు ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 2,593 మందికి కరోనా సోకినట్లు హెల్త్ బులెటిన్‌లో ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 09 మందికి పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఇవాళ మొత్తం కేసుల సంఖ్య 2593కు చేరుకుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22,304 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,584 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒక్కరోజే 943 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 40 మంది కరోనా మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో08, ప్రకాశం08, చిత్తూరు05, కడప04, అనంతపురం03, గుంటూరు03, నెల్లూరు03, విశాఖపట్నం03, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇప్పటి వరకూ మొత్తం 492 మంది రాష్ట్రంలో మృతి చెందారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు..

ఏపిలో కొత్తగా మరో 2,593 కేసులు


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/