ఏపిలో మరో 1608 కొత్త కేసులు నమోదు

ఒక్కరోజే 15 మంది మృతి

ఏపిలో మరో 1608 కొత్త కేసులు నమోదు
coronavirus -ap

అమరావతి: ఏపిలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 1,608 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఏపిలో 1,576 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా… ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 32 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 25,422కి చేరినట్లుగా హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కోవిడ్ వల్ల 15 మంది మృతి మృతిచెందగా.. మొత్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 292 మందికి చేరింది. ప్రస్తుతం ఏపిలో 11,936 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 13,194 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కాగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 208 కొత్త కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 191, తూర్పు గోదావరి జిల్లాలో 169, కర్నూలు జిల్లాలో 144, పశ్చిమ గోదావరి జిల్లాలో 144, గుంటూరు జిల్లాలో 136, ప్రకాశం జిల్లాలో 110 కేసులు గుర్తించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,422కి పెరిగింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/