ఏపి మరో 13శాతం మద్యం షాపులు రద్దు

3,500 నుంచి 2,965కు చేరిన వైన్స్ షాపులు

wine shop
wine shop

అమరావతి: ఏపి ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుండి మరో 535 మద్యం షాపులను రద్దు చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,500 షాపులను ప్రభుత్వమే ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడిపిస్తుండగా, వాటిని 2,965కు తగ్గించింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాగానే, 20 శాతం మేరకు షాపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 13 శాతం షాపులు తగ్గడంతో, ఏడాది వ్యవధిలో 33 శాతం షాపులు తగ్గినట్లయింది. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో మద్యం కనిపించకుండా చేస్తామని జగన్ తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/