టిడిపి నుంచి తప్పుకున్న ఎమ్మెల్సీ

annam satish prabhakar
annam satish prabhakar, AP MLC


విజయవాడ: ఏపిలో టిడిపికి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ అన్నం సతీశ్‌ ప్రభాకర్‌ రాజీనామా చేశారు. పాతికేళ్లుగా తనను ఆదరించి, ప్రోత్సహించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆత్మ ప్రబోధానుసారమే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు సతీశ్‌ ప్రకటించారు. ఐతే ఆయన ఏ పార్టీలో చేరతారు? భవిష్యత్‌ కార్యాచరణ ఏమిటనేది ఇంకా స్పష్టం చేయలేదు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/