రాపాకకు క్షమాపణలు చెప్పాలన్న పవన్

pawan kalyan
pawan kalyan

అమరావతి: జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. కాగా దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌ ద్వారా వివరణ ఇచ్చారు. రాపాక వరప్రసాద్‌కు తాను నోటీసు ఇచ్చానని తప్పుడు ప్రచారం జరుగుతోందని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌సిపి మద్దతుదారులు జనసేనపై దుష్ప్రచారం ఆపాలని కోరారు. దుప్ప్రచారం చేసిన వాళ్లు రాపాక వరప్రసాద్‌ రావు గారికి క్షమాపణ చేప్పాలని డిమాండ్‌ చేశారు. తాను రైతు సౌభాగ్య దీక్షలో ఉంటే..శాసనసభలో ఉన్న రాపాకకు ..వైఎస్‌ఆర్‌సిపి సంబంధిత వెబ్‌సైట్‌లో షోకాజ్‌ నోటీస్‌ రావడం చూస్తుంటే..ఎవరు చేయించారో అర్థం అవుతోందన్నారు. దీనిపై రాజోలు నియోజక వర్గ ప్రజలు కూడా ఖండించాలని పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. అలాగే రాపాక గారిని అరెస్టె చేసి బెయిల్‌ రానివ్వకుండా వైఎస్‌ఆర్‌సిపి నాయకులు ప్రయత్నించినప్పుడు, స్వయంగా రంగంలోకి నేనే దిగుతానని చెప్పడంతో వారు వెనక్కి తగ్గారని ఆ విషయం నియోజకవర్గ ప్రజలు గుర్తు తెచ్చుకోవాలని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/