స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సిపిని గెలిపించాలి

ఎన్నికల మేనిఫెస్టోను నిక్కచ్చిగా అమలు చేస్తున్న ఎకైక సీఎం జగన్‌

Botsa Satyanarayana
Botsa Satyanarayana

అనంతపురం: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని, అన్ని స్థానాల్లో వైఎస్సాఆర్‌సిపి విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారయణ పలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సిపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారన్నారు. ఎన్నికల మేనిఫెస్టొను నిక్కచ్చిగా అమలు చేస్తున్న ఎకైక ముఖ్యమంత్రి జగన్‌ అని అన్నారు. అమ్మఒడి పథకం కింద రూ.6,400 కోట్లు విడుదల చేశారన్నారు. కాగా అమరావతిలో చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని బొత్స దుయ్యబట్టారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబాటుకు చంద్రబాబే కారణమని విమర్శించారు. బినామీ ఆస్తులు కాపాడుకునేందుకు అమరావతి ఉద్యమం చేస్తున్నారని బొత్స ధ్వజమెత్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/