వాణిజ్య కమిటీ చైర్మన్‌ గా విజయసాయిరెడ్డి

YSRCP MP VijaySai Reddy
YSRCP MP VijaySai Reddy

Amaravati, NewDelhi: తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు సీనియర్‌ ఎంపీలకు కీలకమైన పార్లమెంటరీ స్టాం డింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవులు దక్కాయి. వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ గా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్ల మెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నియ మితులయ్యారు. టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనర ల్‌ కే కేశవరావు పరిశ్ర మల శాఖా స్టాండిం గ్‌ కమిటీ చైర్మన్‌ గా నియమితులు కాగా, టూరిజం, రవాణా, సాంస్కృతిక శాఖ స్టాండిం గ్‌ కమిటీ చైర్మన్‌ గా బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ నియమితులయ్యారు. శనివారం లోక్‌ సభ సచివాలయం వివిధ శాఖల పార్ల మెంటరీ స్టాండింగ్‌ కమిటీ లను ప్రకటించింది.
ఒక్కో పార్ల మెంటరీ స్టాండింగ్‌ కమిటీలో లోక్‌ సభ, రాజ్యసభ నుంచి సుమారు 30 మంది ఎంపీలు సభ్యులుగా ఉంటారు. ఇందు లో వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు.