రేపటి నుండి చంద్రబాబు కొత్త వర్క్‌ కోసం తిరగాలి

Vijay Sai Reddy , Chandrababu Naidu
Vijay Sai Reddy , Chandrababu Naidu

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి, ఏపి సిఎం చంద్రబాబు పర్యటనలపై ట్విటర్‌లో ఎద్దేవా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్‌లో స్పందిస్తూ 23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త వర్క్ కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడు. ఈయనకు ఉపాధి కల్పించే స్థితిలో వారెవరూ లేరు. వాళ్లే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారు. ఒక ప్రయోజనకర కార్యక్రమం కోసం ప్రయాణాలు చేస్తే అందరూ ప్రశంసిస్తారు. చంద్రబాబు తిరుగుళ్లు మాత్రం ఊసుపోక చేస్తున్న దేశదిమ్మరి యాత్రల్లా ఉన్నాయి. ఓటమి తప్పదని తెలిసి తనను తాను ఊరడించుకునేందుకు ప్రాంతీయ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. అని విమ‌ర్శించారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/