రాజకీయాలకు మండలి కేంద్ర బిందువుగా మరింది

అలాంటి సభలో నేను సభ్యుడినైనా మండలి రద్దును ఆనందంగా స్వీకరిస్తున్నా

Pilli Subhash Chandra Bose
Pilli Subhash Chandra Bose

అమరావతి: శాసన మండలి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిందని ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సభలో నేను సభ్యుడినైనా మండలి రద్దును ఆనందంగా స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ గతంలో మండలిని చాలా స్వల్పకాలిక ప్రయోజనం కోసం రద్దు చేశారు. కానీ ఇప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం రద్దు నిర్ణయం తీసుకున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన చోట రాజధాని పెట్టాలని శివరామకృష్ణ కమిటీ చెబితే.. చంద్రబాబు పట్టించుకోకుండా నారాయణ కమిటీ వేసి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. చంద్రబాబు చేసిన దురదృష్టకరమైన నిర్ణయాలను సరిచేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. మండలిని రాజకీయ కేంద్రంగా
టిడిపి వినియోగించుకోవడం దురదృష్టకరమని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/