ఎన్‌కౌంటర్ చేస్తే తల్లడిల్లిపోతున్నారు..

roja
roja

అమరావతి: దిశా హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా స్పందించారు. మానవ హక్కుల సంఘాలపై ఆమె సీరియస్ అయ్యారు. మానవ హక్కుల సంఘాలపై  ప్రజలకు నమ్మకం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు రోజా. చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపేస్తే హెచ్ఆర్సీ ఏం చేసిందని మండిపడ్డారు. పోలీసులపై దాడి చేసిన వారిని ఎన్‌కౌంటర్ చేస్తే మానవ హక్కుల సంఘాలు తల్లడిల్లిపోతున్నాయని విమర్శించారు రోజా. దిశా నిందితులను ఆమెను హతమార్చిన చటాన్ పల్లిలోనే పోలీసులు ఎన్‌కౌంటర్ జరిపి హతమర్చారు. దిశ హత్యాచార కేసు నిందితులు మహమ్మద్ ఆరీఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌ని శుక్రవారం ఉదయం తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ జరిపారు. అయితే ఇంకా మృతదేహాల్ని ఇంకా కుటుంబసభ్యులకు అప్పగించలేదు. నలుగురు మృతదేహాల్ని మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. 

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/