కోడెల, యరపతినేనిని కాపాడేందుకే చంద్రబాబు డ్రామా

YSRCP MLA RK
YSRCP MLA RK

Guntur: కోడెల, యరపతినేనిని కాపాడేందుకే చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే విమర్శించారు. పల్నాడు ప్రశాంతంగా ఉందని, ఎలాంటి దాడులు లేవన్నారు. పల్నాడు పచ్చగా ఉంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారన్నారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో శిబిరాలు పెట్టి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నిరాహారదీక్ష, బాధిత శిబిరాలు అన్నీ డ్రామాలేనన్నారు. ఆత్మకూరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే సహకరిస్తామన్నారు. అనుమతిస్తే ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామన్నారు.