చంద్రబాబును కలిసిన వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె

desai tippareddy
desai tippareddy

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబును చిత్తూరు జిల్లా మదనపల్లి వైఎస్‌ఆర్‌సిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యె
 దేశాయ్ తిప్పారెడ్డి కలిశారు. అయితే వైఎస్‌ఆర్‌సిపి తనకు మదనపల్లి టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన సిఎం నివాసానికి వెళ్లి కలిశారు. ఈసందర్భంగా ఆయన టిడిపి నుండి మదనపల్లె టికెట్ ఆశిస్తుండగా.. ఇతర సమీకరణాలనుటిడిపి పరిశీలిస్తోన్నట్టు సమాచారం. తిప్పారెడ్డికి ఏ సీటు ఇవ్వాలనే దానిపై తెదేపా అధిష్ఠానం చర్చిస్తున్నట్టు సమాచారం.
ఇటీవల ఆయన తన కుటుంబంతో కలిసి వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ను కలిసి తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరగా.. ఆయన నుంచి ఎలాంటి హామీ లభించనట్టు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన తిప్పారెడ్డి శుక్రవారం అమరావతి వెళ్లి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/