వైఎస్‌ఆర్‌సిపి మేనిఫెస్టో విడుదల

jagan
jagan , ysrcp president


అమరావతి: ఉగాది పండుగ సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విడుదల చేశారు. తెలుగు ప్రజలందరికీ జగన్‌ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌ మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో చేర్చిన అంశాలు అమలు చేసినప్పుడే విలువ ఉంటుంది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను చేసి చూపించి ప్రజలను ఓట్లు అడిగే పరిస్థితి రావాలి. మేనిఫెస్టో అమలు చేస్తేనే మళ్లీ ఓట్లు అడగాలి. గత మేనిఫెస్టోలో టిడిపి 650 హామీలిచ్చి మోసం చేసింది. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ఒక్క రూపాయి కూడా చేయలేదు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/