టిటిడి ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి ప్రమాణం

Y V subba reddy
Y V subba reddy, YSRCP senior leader

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వారు సన్నిధిలో జరిగిన కార్యక్రమంలో ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌..వైవి సుబ్బారెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, శాసనమండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి, మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సినీ నిర్మాత దిల్‌రాజు, పాలక మండలి మాజీ సభ్యుడు రౌతు సూర్యప్రకాశ్‌రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/