చంద్రబాబు ఓవర్‌ యాక్షన్‌

YSRCP Leader Ambati Rambabu
YSRCP Leader Ambati Rambabu

Amaravati: టిడిపి నేత చంద్రబాబునాయుడు చిన్న చిన్న విషయాలకే ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. అన్యాయం జరిగితే పోరాడాలి కానీ, చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. చంద్రబాబు పాలనలో తమపై ఎన్నో దాడులు జరిగాయని ఆయన అన్నారు. చంద్రబాబు అరాచక పాలన సహించలేకే పల్నాడులో వైకాపాను గెలిపించారని ఆయన అన్నారు. టిడిపి నేతలను హౌస్‌ అరెస్టు చేయడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.