వైఎస్ఆర్‌సిపికి 49.96 శాతం ఓట్లు

ysrcp
ysrcp

అమరావతి: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో వైఎస్ఆర్‌సిపి అత్యధికంగా 49.96 శాతం ఓట్లు సాధించింది. టిడిపి 39.2 శాతం ఓట్లు పొందింది. ఈ రెండు పార్టీలూ సాధించిన ఓట్లలో పది శాతం
వ్యత్యాసం ఉంది. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపి, బీఎస్పీలకంటే నోటాకు ఎక్కువ
ఓట్లు రావడం విశేషం.
జగన్‌కు అత్యధికం… మల్లాది విష్ణుకు అత్యల్పం: శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌కు 90,110 ఓట్ల అత్యధిక మెజారిటీ రాగా, అదే పార్టీకి చెందిన విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి మల్లాది విష్ణు అత్యల్ప మెజారిటీతో కొనసాగుతున్నారు. తుది ఫలితాలు అందేసరికి మల్లాది విష్ణు కేవలం 15 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. అక్కడ రీకౌంటింగ్‌ కోసం టిడిపి అభ్యర్థి పట్టుబడుతున్నారు.

తాజావార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/latest-news/