ఓటమి భయంతోనే వైఎస్ఆర్సిపి దాడి చేస్తుంది

అమరావతి: ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సిపి చేస్తున్న దాడులపై సిఎం చంద్రబాబు స్పందించారు. ఓటమి భయంతోనే వైఎస్ఆర్సిపి తాడిపత్రిలో టిడిపి నేత సిద్దా భాస్కరరెడ్డి హత్య, సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై దాడి, రాప్తాడులో దౌర్జన్యాలకు పాల్పడుతుందని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రాకుండా చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని సీఎం ఆరోపించారు. దాడులు జరిగిన కూడా ప్రజలు ఓటుతోనే వైఎస్ఆర్సిపికి బుద్ది చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/