వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయాన్ని తాడేపల్లికి తరలిస్తాం

vijayasai reddy
vijayasai reddy

అమరావతి: త్వరలో హైదరాబాద్‌ నుంచి తాడేపల్లికి వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయాన్ని తరలిస్తామని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. శాశ్వత కార్యాలయం కోసం స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరతామని, కొత్తగా వాటితో కలిపి 25 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేస్తామని అన్నారు. శని, ఆది వారాల్లో పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని, కార్యకర్తలు గ్రామ వాలంటీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పంచాయితీల్లో ఉద్యోగాల కోసం కార్యకర్తలకు శిక్షణ ఇస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/