టిడిపి నేతల ఇళ్లపై వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు దాడి

TDP, YSRCP
TDP, YSRCP

సత్తెనపల్లి : ఏపిలోని గుంటూరు జిల్లాలో టిడిపి-వైఎస్‌ఆర్‌సిపి శ్రేణుల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రెచ్చిపోయిన వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు, మద్దతుదారులు సత్తెనపల్లి మండలంలోని గుడిపూడిలో టిడిపి నేతల దుకాణాలు, ఇళ్లపై దాడి చేసి ధ్వంసం చేశారు. నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడిపూడిలో నిన్న వినాయక నిమజ్జనం సందర్భంగా గణేశుడి విగ్రహాన్ని టిడిపి నేతల ఇళ్లు ఉన్న వీధి నుంచి వైఎస్‌ఆర్‌సిపి నేతలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగడంతో వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు రెచ్చిపోయాయి. టీడీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లు, షాపులు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డాయి.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/